6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

Writer: Pooja 08:21 AM, 6 సెప్టెంబర్, 2026
‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మించిన ‘జగమే సంగీతం’ వెబ్ సిరీస్‌పై ప్రశంసలు కురిపించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందిన ఈ ఎనిమిది ఎపిసోడ్ల మ్యూజికల్ డ్రామా ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కర్ణాటక సంగీతం, కుటుంబ భావోద్వేగాలు, బాధ్యతలు, ప్రేమకథను మేళవించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సిరీస్‌ను వీక్షించిన చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, హృదయాన్ని హత్తుకునే సంగీతాన్ని ప్రశంసించారు. నిర్మాతగా సుష్మిత సరికొత్త సిరీస్‌ను తీసుకురావడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు.

తండ్రి ప్రశంసలపై సుష్మిత కొణిదెల భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ తనకు అందిస్తున్న ప్రోత్సాహం, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ‘కుమారి 21F’, ‘18 పేజెస్’ చిత్రాల దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్‌ను రాజమండ్రి నేపథ్యంగా తెరకెక్కించారు. సంప్రదాయ సంగీతం, ఆధునిక పాప్ మ్యూజిక్ మధ్య సాగే కథలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మధుబాల కీలక పాత్రలు పోషించగా, అక్షయ్ లగుసాని, సుష్మితా శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్లలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

ట్యాగ్లు
జగమే సంగీతంచిరంజీవిసుష్మిత కొణిదెలఅమెజాన్ ప్రైమ్ వీడియోతెలుగు వెబ్ సిరీస్పల్నాటి సూర్య ప్రతాప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత
జనరల్

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు
జనరల్

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం
జనరల్

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా
సినిమాలు

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు
సినిమాలు

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్
సినిమాలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు
జనరల్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్
ఓటీటీ

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్
షోస్

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి
సినిమాలు

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!