

నటసింహం నందమూరి బాలకృష్ణ 111వ సినిమాపై అభిమానులు ఎదురుచూస్తున్న కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, విడుదల తేదీని ఈరోజు సాయంత్రం 6:40 గంటలకు ప్రకటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ‘సాయంత్రం 6:40కి సిద్ధంగా ఉండండి’ అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది.
ముంబై నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, వెంకట సతీష్ కిలారి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, ఏ.ఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. టైటిల్ ప్రకటనతో సినిమా ప్రమోషన్లు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!