

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న ‘ఓజీ 2’ ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. యాక్షన్, ఎమోషన్స్, భారీ స్థాయి కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మాణ వ్యవహారాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ‘ఓజీ 2’కు సంబంధించిన అధికారిక అప్డేట్లు పవన్ కళ్యాణ్‌కు చెందిన నిర్మాణ సంస్థ నుంచే వస్తుండగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఎలాంటి ప్రకటనలు రాకపోవడం గమనార్హం. సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్లు సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్‌తో కలిసి మరో నిర్మాత కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!