24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?

Writer: Harika S 10:19 AM, 24 సెప్టెంబర్, 2026
‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?

తెలుగు సినిమా నుంచి వరుసగా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో ‘ఆదర్శ కుటుంబం’పై ఆసక్తి నెలకొంది. వెంకటేష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి బజ్‌ ఉంది. అయితే ముందుగా అనుకున్న విడుదల తేదీ నుంచి సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్‌ కన్ఫర్మ్ చేశారు. ఈ మార్పు వెనుక సినిమా షూటింగ్‌లో ఇంకా కొంత భాగం పూర్తి చేయాల్సి ఉండటమే కారణమని టాక్ వినిపిస్తోంది. వెంకీ మామ కూడా తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను తాజాగా పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు మరికొంత సమయం అవసరమైన కారణంగానే విడుదలను వారం రోజులు వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది. ఈ వాయిదాతో నిర్మాణానంతర కార్యక్రమాలకు కూడా కొంత అదనపు సమయం లభించే అవకాశం ఉంది.

మంచి కుటుంబ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి ఉంది. వెంకీ మామ, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమాకు మొదటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండటం కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. షూటింగ్‌ పనులు పూర్తవుతున్న నేపథ్యంలో మిగిలిన కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. తాజా షెడ్యూల్‌ ప్రకారం ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ మార్పుతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ ప్రణాళికల్లో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?

టాక్సిక్‌ను దాటిన హనుమాన్ అంశ్ వసూళ్లు

టాక్సిక్‌ను దాటిన హనుమాన్ అంశ్ వసూళ్లు

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

ట్యాగ్లు
ఆదర్శ కుటుంబంవెంకటేశ్త్రివిక్రమ్శ్రీనిధి శెట్టిథమన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు
రాజకీయాలు

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌
జనరల్

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు
జనరల్

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?
బిజినెస్

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్
జనరల్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...
సినిమాలు

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్
జనరల్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...
సినిమాలు

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!