

ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్‌లలో భద్రతపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌కు నోటీసులు జారీ చేసింది. కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఛానళ్లు, కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తీసుకున్న చర్యలపై 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని అల్టిమేటం ఇచ్చింది. పైరసీ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సూచించింది. కాపీరైట్ ఉల్లంఘన కేవలం సివిల్ కేసు మాత్రమే కాకుండా క్రిమినల్ నేరమని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రొడ్యూసర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, దర్యాప్తు సంస్థల కోసం గ్రీవెన్స్ వ్యవస్థను ఎలా అమలు చేస్తున్నారో తెలియజేయాలని టెలిగ్రామ్‌ను కోరింది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈ యాప్‌పై తాత్కాలికంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రకటనలు, సైబర్ మోసాల అంశాలపై ఇన్‌స్టాగ్రామ్ మరియు మెటాకు కూడా కేంద్రం నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!