25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆకాశంలో ఒక తార' సినిమాపై ఏపీ హోంమంత్రి అనిత రివ్యూ

Writer: Harika S 11:18 PM, 25 నవంబర్, 2026
ఆకాశంలో ఒక తార' సినిమాపై ఏపీ హోంమంత్రి అనిత రివ్యూ

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ఆమె, చిత్ర విశేషాలను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కథాంశం, భావోద్వేగ సన్నివేశాలు, సమాజానికి ఇచ్చే స్ఫూర్తిదాయక సందేశం తనను ఎంతగానో ఆలోచింపజేశాయని ఆమె పేర్కొన్నారు.


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తప్పక చూడాల్సిన సినిమా ఇదని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. ఆడపిల్లల కలలకు తల్లిదండ్రుల నమ్మకం, ప్రోత్సాహం తోడైతే సమాజం విధించే ఎలాంటి హద్దులనైనా అధిగమించవచ్చని ఈ చిత్రం చాటిచెప్పిందని అన్నారు. ఆకాశాన్ని మాత్రమే కాకుండా, అంతరిక్షాన్నే తన గమ్యంగా మార్చుకోగల సత్తా ఆడపిల్లకు ఉందని, ఆమె ఆశయాలకు రెక్కలు ఇవ్వాలే తప్ప సరిహద్దులు గీయకూడదనే గొప్ప సందేశాన్ని దర్శకుడు ఎంతో హృద్యంగా ఆవిష్కరించారని ఆమె కొనియాడారు.చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి తమ సహజ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని మంత్రి ప్రశంసించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి చిత్ర విజయానికి మరింత బలాన్ని చేకూర్చారని పేర్కొన్నారు.

ఇంతటి చక్కటి కథను ఎంచుకుని వెండితెరపై అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు పవన్ సాధినేనికి ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. నిరంతరం విభిన్నమైన, భావోద్వేగభరిత కథలను ప్రేక్షకులకు అందిస్తున్న స్వప్న సినిమా నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్‌లతో పాటు, తెలుగు చిత్రసీమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ మంత్రి అనిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

ట్యాగ్లు
ఆకాశంలో ఒక తార’ఏపీ హోంమంత్రిఅనితదుల్కర్ సల్మాన్సాత్విక వీరవల్లిస్వప్న సినిమానిర్మాతలుస్వప్న దత్ప్రియాంక దత్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆకాశంలో ఒక తార' సినిమాపై ఏపీ హోంమంత్రి అనిత రివ్యూ
సినిమాలు

ఆకాశంలో ఒక తార' సినిమాపై ఏపీ హోంమంత్రి అనిత రివ్యూ

తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్
ఆరోగ్యం

తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్

క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!
జనరల్

క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!

కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ భారీ సన్నాహాలు!
రాజకీయాలు

కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ భారీ సన్నాహాలు!

కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్
క్రీడలు

కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి
రాజకీయాలు

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!
సినిమాలు

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!
జనరల్

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!
టెక్నాలజీ

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!
జనరల్

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?
టెక్నాలజీ

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!