

బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఆమె మాటతీరు, వైఖరిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తన కష్టం, విజయాలు, శారీరక బలం గురించి మేరీకోమ్ తరచూ ప్రస్తావించడం కొంతమంది ప్రేక్షకులకు అసహనం కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీతి తివారితో జరిగిన సంభాషణలో ‘ప్రపంచమంతా నన్ను గుర్తుపడుతుంది. మీరు ఎవరో నాకు తెలియదు’ అని ఆమె చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. ఒకరి గుర్తింపును ప్రశ్నించడం కంటే, ఆ వ్యాఖ్య చేసిన తీరు అహంకారంగా అనిపించిందని కొందరు యూజర్లు అంటున్నారు.
మేరీకోమ్ తన ఫిట్‌నెస్, శారీరక బలం గురించి కూడా మాట్లాడింది. బాక్సింగ్ రింగ్‌లో తనతో పోటీ పడటం అంత సులభం కాదని, తన విజయాలకు కఠోర శ్రమే కారణమని చెప్పినట్లు సమాచారం. ఎవరినైనా ఎత్తి విసిరేయగల శక్తి తనకు ఉందని, తన పిల్లలు కూడా తనలా మారడం అంత సులభం కాదని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ‘నా లాంటి వారు ఎవరూ లేరు’ అనే భావన ఆమె మాటల్లో కనిపిస్తోందంటూ కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఎన్నో విజయాలు అందించిన మేరీకోమ్‌పై గౌరవం ఉన్నప్పటికీ, బిగ్‌బాస్ వేదికపై ఆమె ప్రవర్తనపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. రానున్న వీకెండ్ కా వార్‌లో దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!