
సినిమాలు

నటి త్రిష కృష్ణన్‌కు సంబంధించిన వివాదంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. మహిళలను రాజకీయ ప్రసంగాల్లో లక్ష్యంగా చేసుకోవడం, వారిని విమర్శలకు లేదా వ్యంగ్య వ్యాఖ్యలకు సాధనంగా ఉపయోగించడం ఏ పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని ఆమె పేర్కొన్నారు. రాజకీయ అనుబంధం ఎలా ఉన్నా మహిళలను గౌరవంగా చూడాల్సిన బాధ్యత అందరిదని ఆమె అభిప్రాయపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న మహిళా వ్యతిరేక వ్యాఖ్యలను గుర్తు చేసిన చిన్మయి, ఇలాంటి ధోరణి ఇప్పటికీ కొనసాగడం ఆందోళనకరమని అన్నారు. కావేరి అంశంపై నిర్వహించిన నిరసనలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు త్రిషను ఉద్దేశించినట్లుగా విస్తృతంగా చర్చకు దారితీయగా, ఈ వ్యాఖ్యలను ఖుష్బూ సుందర్ కూడా ఖండిస్తూ త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!