
జనరల్

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడంపై నెలకొన్న వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తోంది. తాజాగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ. దీపిక భారీ పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో 10 శాతం వాటా కోరినట్లు ఆరోపించడంతో పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. హీరోలు లాభాల్లో వాటా కోరినప్పుడు పెద్దగా విమర్శలు ఉండవని, అదే డిమాండ్‌ను మహిళా నటులు చేస్తే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. దీనిని పురుషాధిక్య ధోరణిగా అభివర్ణించారు. ఈ పోస్ట్‌ను దీపికా పదుకొణె లైక్ చేయడంతో, అందులో వ్యక్తమైన అభిప్రాయంతో ఆమె ఏకీభవిస్తున్నారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!