

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో నటించిన 'వసుదేవసుతం' చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. విడుదలకు ముందు చిత్రంపై మరింత ఆసక్తి పెంచేందుకు రిలీజ్ ట్రైలర్‌ను దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేశారు. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పరిచాయి.
రిలీజ్ ట్రైలర్‌లో శక్తివంతమైన డైలాగ్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు, మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్‌ను వీక్షించిన అజయ్ భూపతి చిత్రబృందాన్ని అభినందిస్తూ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ మంజూరు చేయగా, కొత్త కథతో కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమని ప్రశంసించింది. జిజ్జు సన్ని సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం జూలై 10న భారీ స్థాయిలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!