

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గూగుల్ కీలక మార్పును ప్రకటించింది. జూలై 7 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి గూగుల్ ఖాతాకు లభించే 15 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌లో ఇకపై ఆండ్రాయిడ్ బ్యాకప్ డేటా కూడా లెక్కించబడుతుంది. గతంలో యాప్ సెట్టింగులు, కాల్ లాగ్‌లు వంటి కొన్ని బ్యాకప్ అంశాలకు మినహాయింపు ఉండగా, ఇప్పుడు ఆ సౌకర్యాన్ని గూగుల్ తొలగించింది.
కొత్త విధానం ప్రకారం ఎస్‌ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లు, కాల్ లాగ్‌లు, వాల్‌పేపర్లు, వై-ఫై పాస్‌వర్డ్‌లు, యూజర్ సెట్టింగ్స్, ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు, వాటి డేటా కూడా స్టోరేజ్ పరిమితిలోకి వస్తాయి. ఒక్కో పరికరానికి సగటున 40 ఎంబీ మాత్రమే అదనంగా వినియోగమవుతుందని గూగుల్ తెలిపినప్పటికీ, ఇప్పటికే 15 జీబీ పరిమితికి చేరువైన వినియోగదారులు పాత ఫైళ్లను తొలగించడం లేదా గూగుల్ వన్ చెల్లింపు ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి రావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!