
గాసిప్స్

రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ టాక్సిక్ ప్రమోషన్‌లలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన భార్య ఇంట్లో సంప్రదాయబద్ధంగా వరమహాలక్ష్మీ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా యశ్ ఇంట్లో లేకపోయినా, ఆయనను పూజలో భాగం చేయాలని భార్య వీడియో కాల్ చేశారు. దీంతో యశ్ స్క్రీన్ ద్వారా పూజలో వర్చువల్‌గా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల మధ్య చోటుచేసుకున్న ఈ అందమైన క్షణం అభిమానులను ఆకట్టుకుంది. పండుగ సంప్రదాయాలను పాటిస్తూ, తమ బిజీ షెడ్యూల్ మధ్య కూడా కలిసి పండుగను జరుపుకున్న ఈ జంటపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!