
క్రీడలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మరోసారి సినిమాలపై దృష్టి సారిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివాహం అనంతరం వ్యక్తిగత జీవితం, కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆమె గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్త కథలు, ఆసక్తికరమైన పాత్రలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈసారి కత్రినా కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా కథా ప్రాధాన్యం ఉన్న పాత్రలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వెబ్ సిరీస్లు, డిజిటల్ ఒరిజినల్స్ వంటి ఓటీటీ ప్రాజెక్టులపై కూడా ఆసక్తి చూపుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘మెరీ క్రిస్మస్’ తర్వాత పెద్దగా తెరపై కనిపించని కత్రినా, త్వరలో కొత్త ప్రాజెక్టులతో అభిమానులను అలరించే అవకాశం ఉందని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!