

యువ కథానాయకుడు సందీప్ కిషన్ నటిస్తున్న భారీ చిత్రం ‘కరికాల’పై అంచనాలు పెరుగుతున్నాయి. ‘సూపర్ సుబ్బు’తో ఓటీటీలో అలరించిన సందీప్ కిషన్, గత ఏడాది ‘శంబాల’తో విజయం సాధించిన దర్శకుడు యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించగా, సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
తాజాగా ‘కరికాల’ రెండు భాగాల విడుదల తేదీలను మేకర్స్ ఖరారు చేశారు. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది జూలై 2న, రెండో భాగాన్ని అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నాభిమోజు నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చారిత్రక నేపథ్య చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!