

తెలుగు చిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026 ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి మోహన్ వడ్లపట్ల ఘన విజయం సాధించారు. నలుగురు అభ్యర్థులు మోహన్ వడ్లపట్ల, జీవిత, దామోదర్ ప్రసాద్, భరత్ చౌదరి పోటీ చేసిన ఈ ఎన్నికల్లో మోహన్ వడ్లపట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి మొత్తం 15 స్థానాల్లో ‘మన ప్యానెల్’కు చెందిన 12 మంది విజయం సాధించారు. దీంతో నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఆధిపత్యం స్పష్టమైంది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మోహన్ వడ్లపట్లపై నిర్మాతల సమస్యల పరిష్కారం, పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణలో కీలక బాధ్యతలు ఉన్నాయి.
NRIగా ఉంటూ తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న మోహన్ వడ్లపట్ల దర్శకుడు, నిర్మాతగా పలు చిత్రాలను రూపొందించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సైకాలజికల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M (Motive For Murder)’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. 15కి పైగా అంతర్జాతీయ అవార్డులు అందుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘M4M’కు సీక్వెల్‌గా ‘M4M-2: Killer Games’ను రూపొందిస్తున్నట్లు 2026 జూలైలో శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రకటించారు. మోహన్ వడ్లపట్ల, జో శర్మ ఈ సీక్వెల్‌లోనూ కలిసి పనిచేయనున్నారు. నిర్మాతగా ‘మల్లెపూవు’, ‘మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ వంటి చిత్రాలను నిర్మించిన ఆయన, ఇప్పుడు నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా పరిశ్రమ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడతారనే ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!