

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి విభిన్న కథలు, ప్రత్యేకమైన పాత్రలతో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న ఓమ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన, తాజాగా తన సొంత నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ప్రొడక్షన్ నంబర్ 9గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు మేళా అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా కనిపిస్తుండగా, మమ్ముట్టి బ్లాక్ డ్రెస్‌లో పవర్‌ఫుల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఫాలిమి చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నితీష్ సహదేవ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టి కంపెనీ, దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫారర్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ రెండు ప్రముఖ బ్యానర్లు కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!