
క్రీడలు

నటుడు ప్రియదర్శి పులికొండ నటిస్తున్న ఇడుపు కాయితం సినిమాపై వివాదం నెలకొంది. ఈ సినిమా తెలంగాణ యాస, సంస్కృతిని ప్రధానంగా చూపించబోతున్న నేపథ్యంలో, దీనిని ఆంధ్ర తెలుగులో డబ్ చేయాలా లేదా సబ్‌టైటిల్స్‌తో విడుదల చేయాలా అనే చర్చ సోషల్ మీడియాలో వేడెక్కింది. ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల నెటిజన్ల మధ్య వాదోపవాదాలకు దారితీసింది.
ఈ వివాదంపై రచయిత గంటా చక్రపాణి స్పందిస్తూ, అర్థం కానివారు సినిమా చూడకపోవచ్చని వ్యాఖ్యానించారు. కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. ప్రాంతీయ భాష, సంస్కృతిని సినిమాల్లో చూపించడాన్ని అడ్డుకోవద్దని ఆయన అన్నారు. దీంతో ఈ వివాదం మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!