

ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కిస్తున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’పై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు ఫాలో-అప్ మూవీ తప్పకుండా ఉంటుందని దర్శకుడు ఎం.ఎస్. రాజు వెల్లడించారు. అయితే అది ప్రీక్వెల్‌గా వస్తుందా? సీక్వెల్‌గా తెరకెక్కుతుందా? అనే విషయాన్ని ‘అగాధ’ తొలి భాగం విడుదలైన తర్వాతే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. దీంతో సినిమాకు కొనసాగింపు ఉంటుందనే విషయం స్పష్టమైంది.
ఎం.ఎస్. రాజు ప్రకటనతో ‘అగాధ’ తదుపరి కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మొదటి భాగం విడుదలైన తర్వాత కథను ప్రీక్వెల్‌గా కొనసాగిస్తారా? లేక సీక్వెల్‌గా తీసుకెళ్తారా? అనేది వేచి చూడాల్సిందే. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ ఆది వారాహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీవిశాలాక్షి బసులు నిర్మించారు. ‘అగాధ’ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!