

తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రజనీకాంత్ స్పందించలేదనే కారణంతో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌పై కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తీవ్రంగా స్పందించారు. తన తాజా చిత్రం మట్టి కుస్తీ 2 ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడుతూ, సెలబ్రిటీలు కొద్దిరోజులు మౌనంగా ఉంటే చాలు ఊహాగానాలు సృష్టించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోయినా రజనీకాంత్‌ను అనవసరంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు.
చివరకు తనకు విజయ్‌పై ఎలాంటి అసూయ లేదని రజనీకాంత్ స్వయంగా వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరమని విష్ణు విశాల్ పేర్కొన్నారు. భారతీయ సినీ పరిశ్రమలో రజనీకాంత్ సాధించిన స్థానం, ఆయన ఇమేజ్ అసాధారణమని, అలాంటి వ్యక్తిపై అసూయ ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు సెలబ్రిటీల మౌనాన్ని వ్యక్తిగత విభేదాలుగా చిత్రీకరించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!