

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రవితేజ విభిన్నమైన పాత్రలో కనిపించిన ఈ సినిమా వసూళ్లలోనూ మంచి జోరు కొనసాగిస్తోంది.
వీకెండ్ తర్వాత కూడా సినిమా అదే స్థాయి జోరును కొనసాగించడం విశేషంగా మారింది. ముఖ్యంగా నైజాం మార్కెట్‌లో వర్కింగ్ డే రోజున నమోదైన వసూళ్లు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. వర్కింగ్ డే అయినప్పటికీ రిలీజ్ రోజు వచ్చిన రేంజ్‌కు దగ్గరగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
పీఆర్ నంబర్స్ ప్రకారం నైజాం మార్కెట్‌లో ఇరుముడి రూ.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లలో బలమైన హోల్డ్ కనిపించడం సినిమాకు ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.
ప్రస్తుతం ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ కొనసాగిస్తోంది. ఇదే స్థాయిలో ప్రేక్షకుల స్పందన, వసూళ్లు కొనసాగితే లాంగ్ రన్‌లో సినిమా మరింత మంచి నంబర్స్ అందుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!