
బిజినెస్

అమరావతి రాజధానిలో నిర్మిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. డిసెంబర్ చివరి నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం అమరావతి అభివృద్ధిలో కీలకంగా మారనుందని పేర్కొన్నారు.
అమరావతి క్రమంగా నాలెడ్జ్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని మంత్రి నారాయణ అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ హబ్ ఎలా అభివృద్ధి చెందిందో, అదే తరహాలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితోనే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో రాణిస్తున్నారని నారాయణ పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!