

సూపర్‌స్టార్ రజనీకాంత్ సాధారణ బస్ కండక్టర్‌గా మొదలైన తన జీవితాన్ని భారతీయ చిత్రసీమలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు ఆ జీవితాన్ని ఆత్మకథగా పాఠకుల ముందుకు తీసుకురావడానికి రజనీకాంత్ స్వయంగా సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అధికారికంగా వెల్లడించారు. రజనీకాంత్ స్వయంగా ఈ పుస్తకాన్ని రాస్తున్నారని ఆమె తెలిపారు.
ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలు ఇందులో ఉండనున్నాయి. ఈ పుస్తకం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని సౌందర్య అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆత్మకథ ఆధారంగా సినిమా తెరకెక్కితే అది ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2తో పాటు ధర్మన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ఖాళీ సమయాన్ని ఆత్మకథ రచనకే కేటాయిస్తున్నారని ఆమె వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!