
జనరల్

తమిళ-తెలుగు హిట్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా ‘గట్ట కుస్తీ’ సీక్వెల్‌పై డైరెక్టర్ చెల్లా అయ్యావు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మొదటి భాగంతో కథ పూర్తయిందని భావించినప్పటికీ, హీరో విష్ణు విశాల్ ఒత్తిడితో ‘గట్ట కుస్తీ 2’ ఆలోచన మొదలైందని తెలిపారు. కేవలం 30 నిమిషాల చర్చలోనే సీక్వెల్ స్కెలెటన్ సిద్ధమైందని ఆయన చెప్పారు. ఈసారి కూడా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందుతోందని, రమ్యకృష్ణ, యోగి బాబు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారని వెల్లడించారు.
కథ మొదటి భాగం నుంచి నేరుగా కొనసాగుతుందని, హీరో ఇచ్చిన హామీ చుట్టూ ఈ సీక్వెల్ తిరుగుతుందని డైరెక్టర్ హింట్ ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్ టీమ్ మొదట స్క్రిప్ట్‌ను రిజెక్ట్ చేసినా, మార్పుల తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. పార్ట్-3పై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం లేదని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!