
జనరల్

లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో, జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘సిగ్మా’ సినిమా డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. సందీప్ కిషన్ కథానాయకుడిగా, ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి జి.కె.ఎం. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ జేసన్ సంజయ్ తొలి చిత్రానికే అనుభవజ్ఞుడైన దర్శకుడిలా పనిచేశారని ప్రశంసించారు. జేసన్ సంజయ్ తన విజన్‌ను నమ్మి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాతలకు, సందీప్ కిషన్‌తో పాటు మొత్తం చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి త్వరలో ట్రైలర్‌తో పాటు ఇతర ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!