
జనరల్

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘సింగ్ గీతం’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తన ప్రత్యేక కాన్సెప్ట్‌తో ఇప్పటికే సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణ సినిమాల మాదిరిగా ఇందులో డైలాగులు ఉండవు. కథలోని ప్రతి సంభాషణను పాటల రూపంలోనే చూపించనున్నారు. అంతేకాకుండా కథలో అతీంద్రియ అంశాలను కూడా జోడించడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
దర్శకుడు నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావుకు నివాళిగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎలాంటి రాజీ లేకుండా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధిస్తే వయసు సృజనాత్మకతకు అడ్డంకి కాదనే విషయాన్ని మరోసారి నిరూపించడంతో పాటు, ప్రేక్షకులు ప్రయోగాత్మక కథలను అంగీకరించరనే అభిప్రాయాన్ని కూడా మార్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!