

ప్రముఖ నటుడు గోవిందాపై ఆయన భార్య సునీతా ఆహుజా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన నటి కోమల్ రాణి స్వర్ణకార్‌తో గోవిందా సన్నిహితంగా మెలుగుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ఇటీవల గోవిందా, కోమల్ రాణి కలిసి విమానాశ్రయం నుంచి వెళ్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో సునీతా ఆయన తీరును తప్పుపట్టినట్లు తెలుస్తోంది. గతంలో గోవిందాకు ఇతర నటీమణులతో సంబంధాలున్నాయని తాను చెప్పినప్పుడు అభిమానులు తనను ట్రోల్ చేశారని ఆమె గుర్తుచేశారు. ఈ విషయంపై ఇక మాట్లాడాలని తనకు లేదని స్పష్టం చేశారు.
ఇటీవల సునీతా చేసిన వ్యాఖ్యలపై గోవిందా స్పందిస్తూ, ఆమె తనపై ఉన్న ప్రేమతోనే విమర్శలు చేస్తుందని అన్నారు. తన జీవితంలో ఈ స్థాయికి చేరుకోవడంలో సునీతా కృషి ఎంతో ఉందని, పిల్లలను ఆమె ఎంతో ప్రేమగా పెంచిందని ప్రశంసించారు. కూలీ నెం.1, ఆంఖే, హీరో నెం.1, రాజాబాబు, బడే మియా ఛోటే మియా, పార్టనర్ వంటి విజయవంతమైన చిత్రాలతో గోవిందా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1987లో సునీతా ఆహుజాను వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు సంతానం ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!