

తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కరుప్పు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో మరోసారి జతకట్టనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ఈ వార్తపై ఆసక్తి పెరిగింది.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఛాతీ వ్యాధుల నిపుణుడైన ఆయన తక్కువ ఫీజుతో పేదలకు వైద్య సేవలు అందించి విశేష గుర్తింపు పొందారు. ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని సూర్య ప్రధాన పాత్రలో టీజే జ్ఞానవేల్ తెరకెక్కించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!