12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Harika S 05:23 AM, 12 ఆగస్టు, 2026
వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఈ శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య, వెంకీ అట్లూరితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘లక్కీ భాస్కర్’ సినిమా చూసిన తర్వాత వెంకీ అట్లూరి చెప్పే ఏ కథకైనా తాను ఓకే చెప్పేవాడినని, ఆయనతో కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని సూర్య తెలిపారు.

అయితే అంతకుముందే వెంకీ అట్లూరి ఓ బయోపిక్ స్క్రిప్ట్‌తో తనను సంప్రదించారని సూర్య వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని చెప్పారు. దీంతో సూర్యతో వెంకీ తెరకెక్కించాలనుకున్న బయోపిక్ ఎవరిపై అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. తన గత రెండు చిత్రాలు పిరియాడిక్ నేపథ్యంతో సాగడంతో మరోసారి అదే తరహా కథ చేస్తే రొటీన్‌గా అనిపించే అవకాశం ఉందని వెంకీ భావించి ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సూర్య కూడా మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని కోరుకోవడంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథ రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఈ చిత్రం సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌పై భారీ అంచనాలను పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

త్రిష పోస్ట్‌తో కోలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ

త్రిష పోస్ట్‌తో కోలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ

ట్యాగ్లు
విశ్వనాథ్ అండ్ సన్స్సూర్యవెంకీ అట్లూరిమమితా బైజుతెలుగు సినిమాసూర్య సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చిరు లీక్స్‌...మెగా 158 టైటిల్‌ ఇదేనా?

చిరు లీక్స్‌...మెగా 158 టైటిల్‌ ఇదేనా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి
జనరల్

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
జనరల్

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌
జనరల్

అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం
సినిమాలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి
సినిమాలు

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక
సినిమాలు

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్
ఓటీటీ

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ
జనరల్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ