
సినిమాలు

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిసి చేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతుండగా, త్వరలో విడుదలయ్యే కొత్త టీజర్లో చిత్రానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. దీంతో అభిమానుల్లో సినిమా పట్ల మరింత ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రతినాయకుడు ‘షికంజా మాలిక్’ పాత్రలో కనిపించనున్నారు. నాని ఇప్పటివరకు చేయని స్థాయిలో బోల్డ్, ఊరమాస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్, సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!