

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, డిజిటల్ హక్కుల విషయంలో చిత్రబృందం తొందరపడటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.150 కోట్ల ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే మేకర్స్ అంచనాలతో పోలిస్తే ఈ మొత్తం తక్కువగా ఉండటంతో, ప్రస్తుతానికి ఓటీటీ చర్చలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్టూడియోలతో జరిగిన చర్చలు కూడా ఆశించిన స్థాయిలో ఫలించలేదని సమాచారం. అయినప్పటికీ భారీ ప్రాజెక్ట్ కావడంతో చిత్రబృందం ఎలాంటి ఆర్థిక ఒత్తిడికి లోనవడం లేదట.
మార్కెటింగ్ వ్యూహాల్లో రాజమౌళికి ఉన్న అనుభవంపై మేకర్స్ పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. సరైన సమయంలో అన్ని కీలక డీల్స్‌ను పూర్తి చేయగలరనే ధీమాతో చిత్రబృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే డిజిటల్ హక్కులను తొందరగా ముగించకుండా, మరింత మెరుగైన ఒప్పందం కోసం వేచి చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై ఏర్పడిన భారీ క్రేజ్ కారణంగా విడుదలకు ముందే పలు రకాల డీల్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!