

రవితేజ నటించిన ‘ఇరుముడి’ రెండో వారాంతం పూర్తయిన తర్వాత కూడా థియేటర్లలో తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికీ పలు చోట్ల హౌస్‌ఫుల్స్ నమోదవుతుండటంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమా ఊహించని విజయాన్ని అందించింది. అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యం కావడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో మొదటి నుంచే ఆసక్తి ఏర్పడగా, పాజిటివ్ టాక్‌తో సినిమా మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఇప్పటికే ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. ప్రస్తుతం కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఇదిలా ఉండగా, ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సెప్టెంబర్ 18 నుంచి సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే థియేటర్లలో సినిమా ఇంకా మంచి వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు, ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్‌ను మరికొన్ని వారాలు వాయిదా వేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!