
రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు, రేపు కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పులివెందులకు చేరుకున్న అనంతరం భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ప్రజల సమస్యలను తెలుసుకునే కార్యక్రమంలో పాల్గొని, అనంతరం పులివెందులలోని తన నివాసంలో బస చేయనున్నారు.
రేపు ఉదయం 7:45 గంటలకు ఇడుపులపాయకు చేరుకోనున్న జగన్ తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు, స్మారక కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించనున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఇడుపులపాయ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!