

బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్‌కు టాలీవుడ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కడం లేదనే చర్చ జరుగుతోంది. ‘దేవర’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, తాజాగా ‘పెద్ది’ చిత్రంలోనూ నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారనే విమర్శలు వచ్చాయి. తాజాగా నటి అదితీ బాలన్ కూడా జాన్వీ పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన అదితీ బాలన్.. ‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్రను మరింత అర్థవంతంగా, బలంగా రాసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అసలు ఇలాంటి పాత్రను ఎందుకు రూపొందించారో తనకు అర్థం కాలేదని, పాత్రకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే మంచి ప్రభావం చూపించేదని పేర్కొన్నారు. మహిళా పాత్రల ప్రాధాన్యత, కథలో వాటి ప్రాముఖ్యతపై తరచూ తన అభిప్రాయాలను వెల్లడించే అదితీ బాలన్ తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!