

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల అభిమాన నటి సాయి పల్లవి ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ‘తండేల్’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న ఆమె, ప్రస్తుతం బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో సీత పాత్రలో నటిస్తున్నారు. ఇదే సమయంలో ధనుష్ హీరోగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘D-55’ ప్రాజెక్ట్‌లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సాయి పల్లవి తొలిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా హోమ్లీ, ఎమోషనల్ పాత్రల్లో మెప్పించిన ఆమె, ఈసారి ఖాకీ అవతారంలో యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారని తెలుస్తోంది. ధనుష్-సాయి పల్లవి కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!