

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన సక్సెస్‌ఫుల్ అడ్వెంచర్ ఎంటర్‌టైనర్ ‘అతిరథి’ ఇప్పుడు సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని సాధించగా, ఇప్పుడు తెలుగు మరియు మలయాళ భాషల్లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. రియా షిబు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, ఫాంటసీ, అడ్వెంచర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఈ చిత్రంలో టొవినో థామస్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూడు కాలాల్లో సాగే కథ, గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన నిర్మాణ విలువలు, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ‘అతిరథి’ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుండగా, ఈ వీకెండ్‌లో సోనీ లివ్‌లో ట్రెండింగ్ టైటిల్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!