
క్రీడలు

వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే రవిబాబు నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ‘రేజర్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మే 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యాక్షన్ ప్రేమికుల నుంచి మంచి స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా జూన్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
సీసీ కెమెరాల సంస్థను నిర్వహించే విష్ణు అనుకోకుండా ముఖ్యమంత్రి హత్యకు సంబంధించిన కీలక వీడియోను రికార్డ్ చేస్తాడు. ఆ ఆధారాలను చెరిపేయాలనుకున్న నేరగాళ్లు విష్ణును హత్య చేస్తారు. ఈ క్రమంలో ప్రాణాపాయంలో చిక్కుకున్న అతని కుమార్తెను రక్షించే బాధ్యతను ‘రేజర్’ తీసుకుంటాడు. రాజకీయ కుట్రలు, సస్పెన్స్, యాక్షన్ అంశాలతో సాగే ఈ కథ ప్రేక్షకులకు ఉత్కంఠభరిత అనుభూతిని అందించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!