

హీరో సూర్య, హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కరుప్పు’ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’గా విడుదలైంది. ఈ నెల 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కోలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం సూర్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
కథ విషయానికి వస్తే.. అనారోగ్యంతో ఉన్న కూతురి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్కు వచ్చిన తండ్రి నాంపల్లి రైల్వే స్టేషన్లో దొంగల దాడికి గురై 60 సవర్ల బంగారం కోల్పోతాడు. పోలీసులు కేవలం 45 సవర్లను మాత్రమే రికవరీ చేస్తారు. కోర్టు ప్రక్రియలో చిక్కుకుపోయిన వారు లాయర్ బేబీ కృష్ణను ఆశ్రయిస్తారు. డబ్బు కోసం కేసును లేటు చేసే అతని ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి వీరభద్రుడి ఆలయంలో ప్రార్థిస్తాడు. అనంతరం దేవుడు భూమ్మీదకు వచ్చి న్యాయం ఎలా చేశాడన్నదే కథ.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!