

తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ఐడెంటిటీ’ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2022 అక్టోబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో అమరేష్ రాజు, భాగ్యలక్ష్మి, కుషి ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో పెద్దగా గుర్తింపు పొందకపోయిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ మరియు మిస్టరీ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కథ విషయానికి వస్తే, రిషిదేవ్ అనే ఎన్‌సీబీ అధికారి ప్రమాదంలో జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. అదే సమయంలో హరన్ అనే వ్యక్తి భారీ డ్రగ్ రాకెట్ నిర్వహిస్తున్నాడని అధికారులు గుర్తిస్తారు. అయితే విచారణలో హరన్, రిషిదేవ్ ఒకరేనని బయటపడుతుంది. తన గతాన్ని మరిచిపోయిన ఓ అధికారి చుట్టూ తిరిగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో తర్వాత జరిగే పరిణామాలే కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!