

ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక కేంద్ర నిధులు పొందిన రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, తక్కువ జనాభా ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల రాష్ట్రానికి గణనీయమైన నిధులు లభించాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్) కింద ఏపీకి రూ.7,700 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తవడానికి సుమారు మూడు సంవత్సరాలు పట్టవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూమి మాత్రమే కేటాయించగా, నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అమరావతి బిల్లు, సెంట్రల్ సెక్రటేరియట్, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, వీటికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!