
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కొంతమంది టీడీపీ నాయకుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను తప్పకుండా పాటించాలని సూచిస్తూ, ఇకపై ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను పెట్టిన గీత దాటితే అసలు సహించబోమని, అవసరమైతే సస్పెండ్ చేయడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
పార్టీ పేరు ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే నాయకులు బాధ్యతగా ప్రవర్తించాలని ఆయన అన్నారు. పార్టీ ఇమేజ్‌ను కాపాడేందుకు డ్యామేజ్ కంట్రోల్ చర్యలను కూడా వేగంగా తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమయంలో పార్టీ లో క్రమశిక్షణ, ఐక్యత చాలా ముఖ్యం అని ఆయన సందేశం ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!