

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం తొర్రూరులో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ర్యాలీలో 420 హామీలను గుర్తుచేస్తూ 420 అడుగుల పొడవైన ఫ్లెక్సీని ప్రదర్శించనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
తొర్రూరు బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ మార్కెట్ సమీపంలోని గాంధీ చౌరస్తా వరకు కొనసాగనుంది. పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్సై మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అదనపు బలగాలను మోహరించి, వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఉదయం 8 గంటల నుంచే బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!