
జనరల్

జంతర్‌మంతర్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యువతి రుచికా సింగ్‌పై నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను పరిశీలించిన అనంతరం ఫిర్యాదు చేసినట్లు స్మృతి సింగ్ తెలిపారు.
ప్రధాని వంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ హోదా గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!