
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని స్పష్టంగా సూచించారు. తెదేపా ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రాజకీయ క్రమశిక్షణను పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. గొడ్డలి పార్టీని విష వృక్షంగా అభివర్ణిస్తూ దాని ప్రభావానికి దూరంగా ఉండాలని తెలిపారు.
అదే విధంగా ఆ పార్టీ కులాలు, మతాలను అడ్డం పెట్టుకుని విద్వేషాలను రెచ్చగొడుతుందని చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్షం వేసే ఉచ్చులో పడకూడదని నేతలకు హెచ్చరించారు. పార్టీ ఐక్యతను కాపాడుతూ సానుకూల రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!