

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా హకీంపేటలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కళాశాలలతో పాటు హాస్టళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పనులు నెమ్మదిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, నిర్మాణాలను వేగవంతం చేసి ప్రతి ప్రాజెక్టు పురోగతిని నెలనెలా నివేదించాలని అధికారులను ఆదేశించారు.
ఇకపై ప్రతి నెలా స్వయంగా పనుల పురోగతిని తనిఖీ చేస్తానని, అవసరమైతే ఒక రోజు ప్రాజెక్టు ప్రాంతంలోనే బస చేస్తానని సీఎం తెలిపారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అలాగే భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వచ్చే వారంలోగా పట్టాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!