

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సంబంధించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీలోని నేతలే బయటకు తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఎవరు బయటపెట్టారో కాంగ్రెస్ నాయకత్వానికి బాగా తెలుసని వ్యాఖ్యానించారు. మీనాక్షి నటరాజన్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల వల్లే వచ్చిందని కేటీఆర్ అన్నారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమవుతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ అంశాన్ని బయటపెట్టిన వ్యక్తి ఎవరో పార్టీ నాయకత్వం గుర్తించాలని కూడా ఆయన సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!