
ఆరోగ్యం

కాంగ్రెస్ చేపట్టిన ధర్నాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థుల పేరుతో రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రచారం కోసం దేశ విద్యార్థులను ఉపయోగించుకోవడం సరికాదని, విద్యార్థుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు.
నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థలో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!