
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చోటుచేసుకున్నాయి. స్పీకర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి తాతా మధును అరెస్టు చేయాలని కాంగ్రెస్ నాయకులు గతంలో డిమాండ్ చేశారు. తాజా అరెస్టుతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!