
జనరల్

బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీష్‌రావు, ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. తాను రేవంత్ రెడ్డి మాదిరిగా ఒట్టు పెట్టి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే వ్యక్తిని కాదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే ముఖ్యమని పేర్కొన్నారు.
భద్రాద్రి శ్రీరాముడి పేరుతో చేసిన రుణమాఫీ హామీ ఏమైందని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం పక్కన పెడితే కనీసం ఖమ్మంలోనైనా రుణమాఫీ పూర్తిగా అమలు చేశారా అని నిలదీశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేయలేని వైఫల్యాన్ని అబద్ధాలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాట తప్పడం, పార్టీలు మారడం తనకు అలవాటు కాదని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!