

కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత వెంకట్ కె. నారాయణకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయి కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తాత్కాలిక నియామకం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని, సేవా నిబంధనలు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ హీరోగా నటిస్తున్న 'జననాయగన్' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలకు సంబంధించి గత కొంతకాలంగా పలు చర్చలు, వివాదాలు కొనసాగుతున్నాయి. విజయ్ రాజకీయ ప్రయాణంలో ఎన్నికల ప్రచారం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వెంకట్ కె. నారాయణ ఆయనతో సన్నిహితంగా పనిచేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!