

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కోసం ఢిల్లీలో కీలక సమావేశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం కావాలని రేవంత్ రెడ్డి రెండుసార్లు లేఖ రాశారని పేర్కొన్నారు. ఆ అభ్యర్థన మేరకు గత రెండు రోజులుగా ఢిల్లీలో సమావేశాల సమన్వయం చేసినట్లు చెప్పారు.
జూన్ 22న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం జరగగా, జూన్ 23న కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్, అశ్విని వైష్ణవ్‌లతో సంయుక్త సమావేశం జరిగినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎప్పటికీ కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!